Weather Report

33°C
21.png
Now

Day: Haze
Windchill: 33°C
Wind: 13 kph SW
Humidity: 29%

About Mothkur

మోత్కూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పూర్వం ఈ ప్రాంతంలో మోదుగ చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని మోదుగుల ఊరు అని పిలిచేవారు. అది కాలక్రమేణా మొదుగూరు, మొతుకూరు గా పిలువబడి చివరకు మోత్కూర్ గా మారింది. ఇది రాష్ట్ర రాజదాని హైదరాబాద్ కు 102 కి. మీ దూరంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. మోత్కూర్, ఆత్మకూర్, గుండాల మూడు మండలాలకు కలిపి ఇది ఒక ప్రాంతీయ వర్తకకేంద్రంగా ఉంది. మోత్కూర్ కి ఆనుకొని బిక్కేరు (కృష్ణానదికి ఉపనది) ప్రవహిస్తుంది. ఈ ఊరిలో ఉన్న అనేక దుకాణాలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు అవసరాన్ని తీరుస్తున్నాయి. మోత్కూర్ మూడు భాగాలుగా ఉంటుంది. అవి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పోతాయిగడ్డ. అంతేకాక చుట్టుపక్కల కొద్దిదూరంలో పద్మశాలీకాలనీ, డ్రైవర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, లూర్థు నగర్, వెంకటేశ్వర కాలనీ మరియు సుందరయ్య కాలనీ వంటి అనేక నివాస కాలనీలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ ఊరిలో అభివృద్ధికి నోచుకోని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామములో రక్షిత మంచినీటి సరఫరా సమస్యగా ఉన్నది.


శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం
అధిక సంఖ్యలో హిందువులు ఉన్నప్పటికీ, ముస్లీంలు మరియు క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వీరంతా ఎలాంటి విద్వేషాలు లేకుండా కలసికట్టుగా ఉంటారు. మోత్కూర్ కాకతీయుల కాలంలో మధ్యయుగ భారతదేశంగా పిలువబడిందని ప్రాచూర్యంలో ఉంది. ఈ ఊరిలో ఉన్న రామలింగేశ్వరాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారని ప్రతీతి. ప్రతి సంవత్సరం అగ్ని గుండాలు ప్రముఖ హిందూ పండుగ హోలీ తర్వాత నిర్వహిస్తారు. చాలా మంది సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అంతేకాకుండా గ్రామదేవతలు చాలా మంది అక్కడక్కడ వెలిసారు. వీరందరికి చిన్నచిన్న గుళ్ళు నిర్మించి గ్రామస్తులు పూజలు నిర్వహిస్తుంటారు. కొత్త బస్టాండ్ దగ్గర పెద్దమ్మ ఆలయం, పోతాయిగడ్డ సాయినగర్ లో సాయిబాబా దేవాలయం ఒక మసీదు మరియు ఒక మిషనరీ రన్ చాపెల్ ఉన్నాయి.


 

Welcome

మోత్కూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పూర్వం ఈ ప్రాంతంలో మోదుగ చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని మోదుగుల ఊరు అని పిలిచేవారు. అది కాలక్రమేణా మొదుగూరు, మొతుకూరు గా పిలువబడి చివరకు మోత్కూర్ గా మారింది. ఇది రాష్ట్ర రాజదాని హైదరాబాద్ కు 102 కి. మీ దూరంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది.

Read more